|
ప్రభాస్ హీరోగా యు.వి.ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం �మిర్చి'. అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్. ఈ చిత్రంతో రచయిత కొరటాల శివ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వి.వంశీకృష్ణ, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మాతలు. ఈచిత్రం సంక్రాంతికి(జనవరి 11, 2013) విడుదల కాబోతోందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ముందగానే డిసెంబర్ 21, 2012న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ముందుగానే విడుదల చేస్తే కలెక్షన్ల పరంగా కలిసి రావడంతో పాటు క్రిస్ మస్, న్యూ ఇయర్, సంక్రాంతి హాలిడేస్ కలిసొచ్చి సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయని భావిస్తున్నారట నిర్మాతలు. నవంబర్ చివరి వారంలో ఆడియో విడుదల చేసే అవకాశం ఉంది. అయితే దీనిపై అఫీషియల్ ప్రకటన వెలువడాల్సి ఉంది.
ప్రభాస్ అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ముఖ్యంగా ఈచిత్రం స్టోరీలో ఇంటర్వెల్ లో ట్విస్ట్ ఉంటుందని, అదే విధంగా ఇంటర్వెల్ లో హై ఓల్టేజ్ ఫైటింగ్ సీక్వెన్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది. కథకు ఇంటర్వెల్ సీక్వెన్స్ కీలకం కానుందని తెలుస్తోంది. అదే సమయంలో ఎంటర్ టైన్మెంట్స్ అండ్ కామెడీ ట్రాక్ కు కూడా సరైన ప్రాధాన్యం ఇస్తూ బ్యాలెన్స్ చేస్తున్నారు.
సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, ఆదిత్యమీనన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మది, ఆర్ట్: ఏఎస్ ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్‌కుమార్, నిర్మాణ సంస్థ: యు.వి.క్రియేషన్స్, నిర్మాతలు: వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, దర్శకత్వం: కొరటాల |
You have read this article ప్రభాస్ 'మిర్చి' ముందుగానే రిలీజ్ అవుతోందా?
with the title ప్రభాస్ 'మిర్చి' ముందుగానే రిలీజ్ అవుతోందా? . You can bookmark this page URL http://eboneeezer.blogspot.com/2012/11/blog-post_4.html. Thanks!