|
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు వివాదం కొనసాగుతూనే ఉంది. ఇందులో తప్పుప్పొల సంగతి ఎలా ఉన్నా, ఇలాంటి వాటిలో రాజీ కుదర్చడానికి అటు సినిమా రంగ పెద్దలు,ఇతర ప్రముఖులు సహజంగా పూనుకుంటారు. కాని సినీ రంగంలో ఉన్న వైరుధ్యాల కారణంగానో, లేక మోహన్ బాబుతో తమకు ఎందుకు లే తలనొప్పి అనుకునే ఈ ప్రయత్నాలు జరుగుతున్నట్లుకనబడడం లేదు.తాజాగా హీరో మంచు విష్ణు శుక్రవారం మానవ హక్కుల కమిషన్ లో బ్రాహ్మణులపై ఫిర్యాదు చేశారు.
బతికుండగానే తమకు పిండప్రదానం చేయటమే కాకుండా, తమ ఇంటిపైకి దాడి చేశారంటూ ఆయన తన ఫిర్యాదులో ఆరోపించారు.ఈ పిటిషన్ ను స్వీకరించిన హెచ్ ఆర్ సీ ఈ అంశంపై ఈనెల 16వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మను కోరింది.ఇప్పటికే బ్రాహ్మణ సంఘాలు తమపై మోహన్ బాబు మనుషులు దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ సంఘాలు దీనిని సీరియస్ గా తీసుకున్నాయి. |
You have read this article బ్రాహ్మణులకు మధ్య రాజీ కుదరదా? /
మోహన్ బాబు
with the title మోహన్ బాబు, బ్రాహ్మణులకు మధ్య రాజీ కుదరదా? . You can bookmark this page URL https://eboneeezer.blogspot.com/2012/11/blog-post_6827.html. Thanks!